Saturday, August 27, 2011

Sad songs


I dunno why., but i always love sad songs...
This is the one thats very dear to me... Hope u all will enjoy it


ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు

దేశ దేశాలన్ని తిరిగిచూసేవు...

ఏడ తానున్నాడో బావా జాడ తెలిసిన పోయిరావా 

అందాల ఓ మేఘమాల ఆ.. చందాల ఓ మెఘమాల



గగన సీమల తేలు ఓ మేఘమాల

మావూరు గుడిపైన మసలి వస్తున్నావా

మల్లి మాటేదైన నాతో

మనసు చల్లగా చెప్పిపోవా

నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాల ఓ మేఘమాలా



మమతలెరిగిన మేఘమాలా

నా మనసు బావకు చెప్పిరావా

ఎన్నాళ్లు నాకళ్లు దిగులుతో రేపవలు

ఎదురు తెన్నులు చూచేనే

బావకై చెదరి కాయలు కాచెనే

నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాలా ఓ మేఘమాలా



మనసు తెలిసిన మేఘమాలా

మరువలేనని చెప్పలేవా

మల్లితో మరువలేనని చెప్పలేవా

కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని

మల్లిరూపె నిలిచేనే నా చెంత మల్లి మాటే పిలిచేనే



జాలి గుండెల మేఘమాలా

బావ లేనిది బ్రతుకజాల

కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని

వాన జల్లుగ కురిసిపోవా

కన్నీరు ఆనవాలుగ బావ మ్రోల........


Moreover., see how cute Bhunumatigaru is..... And love her voice...
The lyrics are awesome too..... Hats-off to Devulapalli Krishna Sastry garu

No comments:

Post a Comment